Personalized
Horoscope

కుంభం వార్షిక రాశిఫలాలు 2025

ఈ కథనంలో కుంభం వార్షిక రాశిఫలాలు 2025 ఉద్యోగం, వ్యాపారం, సంబంధాలు, ఆర్థికం, ఆరోగ్యం ఇంకా మొదలైన జీవితంలోని అనేక భాగాలలో స్థానికుల భవిష్యత్తును తెలుసుకుందాము. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం కుంభం అనేది సహజ రాశిచక్రం యొక్క పదకొండవ సంకేతం మరియు ఇది గాలి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. కుంభరాశిని శని పాలిస్తాడు, ఇది ఆకాంక్షలు మరియు సంతృప్తి యొక్క నెరవేర్పును కూడా సూచిస్తుంది. కుంభం ఒక పరిశోధనా సంకేతం. మే 2025 నుండి ఇదవ ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం వృత్తి, డబ్బు ఇంకా సంబంధాల పరంగా మంచి ఫలితాలను ఇస్తుంది. బృహస్పతి మే 2025 కి ముందు వృషభరాశిలో రెండవ మరియు పదకొండవ ఇంటికి అధిపతిగా ఉంటాడు. శని ఫిబ్రవరి 2025 వరరాకు మొదటి ఇంటిలో మరియు మార్చి 2025 నుండి మీనరాశిలో రెండవ ఇంట్లో శని స్థాపన చేయబడుతుంది. మొదటి ఇంట్లో శని ఉనికి కొన్ని సార్లు మీ సహనాన్ని పరీక్షించవచ్చు ఇంకా విజయాన్ని సాధించడానికి మీరు చాలా ప్లాన్ చేసుకోవాలి. మే 2025 నుండి బృహస్పతి సంచారము మీకు అన్ని ప్రయోజనాలను అందించడానికి సిద్దంగా ఉంది మరియు మీ చంద్ర రాశిని ప్రభావితం చేస్తుంది. మే 2025 నుండి మీ చంద్రుని రాశి నుండి మొదటి ఇంట్లో రాహువు మరియు ఏడవ ఇంటిలో కేతువు ఉండటం వలన మీకు అనుకూలమైన ఫలితాలు రాకపోవచ్చు మరియు మీ సహనాన్ని దూరం చేయవచ్చు.

Aquarius Horoscope 2025 in Telugu

Read in English -Aquarius Yearly Horoscope 2025

కుంభరాశి వార్షిక జాతకం 2025: కెరీర్

2025 కుంభరాశి వార్షిక జాతకం మార్చి తర్వాత మీ కెరీర్ లో విజయం సాధించవచ్చని సూచిస్తుంది, ఎందుకంటే శని రెండవ ఇంట్లో ఉంటాడు. మార్చి 2025 చివరి నుండి రెండవ ఇంట్లో శని సంచారం మీ కెరీర్ లో మితమైన విజయాన్ని సూచిస్తుంది, మీరు ఉద్యోగం చేస్తున్న లేకపోతే వ్యాపారాన్నిచేస్తున్నా, మితమైన లాభాలను మాత్రమే పొందగలరు. మీరు ఏప్రిల్ 2025 వరకు మీ కదలికలలో ఓపిక పట్టవలసి ఉంటుంది ఇంకా మే 2025 తర్వాత మీ కెరీర్ లో మెరుగుదల కోసం బృహస్పతి యొక్క ప్రయోజనకరమైన సంచారము ఐదవ ఇంట్లో సంభవిస్తుంది. మే 2025 నుండి బృహస్పతి యొక్క ఈ సంచారం కారణంగా మీరు మీ వాగ్దానాలను నెరవేర్చే ఇంకా మీకు సంతృప్తిని కలిగించే కొత్త ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. ఫిబ్రవరి 2025 వరకు మొదటి ఇంటిలో ఉన్న శని మిమ్మల్ని ఉద్యోగ ఒత్తిడిని ఎదుర్కోవచ్చు మరియు దీని కారణంగా, మీరు మితమైన సంతృప్తిని ఎదుర్కోవచ్చు. జులై 13,2025 నుండి నవంబర్ 28, 2025 వరకు శని యొక్క తిరోగమన సమయంలో మీరు మరింత ఉద్యోగ ఒత్తిడికి మరియు గుర్తింపు లేమికి లోనయ్యే అవకాశం ఉన్నందున మీరు మీ కెరీర్ కు సంబంధించి మీ కదలికలలో మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మార్చి 2025 తర్వాత మీ కెరీర్ లేదా వ్యాపారంలో మెరుగైన ఫలితాలను ఆశించవొచ్చు శని రెండవ ఇంట్లో ఉండటం వలన మీరు సులభంగా ఇంకా నమ్మకంగా ఉంటారు. ఏదేమైనప్పటికీ మే 2025 తర్వాత మొదటి ఇంట్లో రాహువు ఇంకా ఏడవ ఇంట్లో కేతువుల సంచారము అధిక స్థాయి లాభదాయకమైన రాబడిని ఇవ్వకపోవచ్చు. మే 2025 తర్వాత ఐదవ ఇంట్లో బృహస్పతి సంచారం మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఇంకా మీ కెరీర్ కు సంబంధించి మీకు మరింత విశ్వాసం మరియు విజయాన్ని కలిగిస్తుంది. మే 2025 తర్వాత మీరు మీ ఉద్యోగంలో బాగా రాణించవొచ్చు. మీరు చేసిన కృషికి మరింత గుర్తింపును పొందడం మే 2025 తర్వాత మీకు సాధ్యమవుతుంది. మీరు మీ ఉద్యోగంలో చేసే ఏ ప్రయత్నాలైనా సాఫీగా సాగుతాయి. మీరు వ్యాపారం చేస్తుంటే, మీరు అధిక స్థాయి లాభాలను పొందవచ్చు మరియు కొత్త వ్యాపార ఆర్డర్లను పొందవచ్చు.

हिंदी में पढ़ें- कुंभ वार्षिक राशिफल 2025

కుంభరాశి వార్షిక జాతకం:ఆర్థిక జీవితం

ఆర్థిక జీవితానికి సంబంధించిన కుంభరాశి వార్షిక జాతకం 2025 అంటే మీకు వచ్చే లాభాలు ఇంకా ఖర్చులు రెండింటిలో మిశ్రమ ఫలితాలను సాధ్యమవుతాయని సూచిస్తుంది. ఏప్రిల్ 2025 వరకు మీకు ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు ఇంకా ఇది మీకు ఆందోళన కలిగించే ఇంటికి సంబంధించిన ఖర్చులు కావచ్చు. కుంభం వార్షిక రాశిఫలాలు 2025 సమయంలోమీరు వ్యాపారాన్ని చేస్తునట్టు అయితే ఏప్రిల్ 2025 వరకు ఓపికగా ఉండండి. మే 2025 తర్వాత బృహస్పతి ఐదవ ఇంటికి వెళ్లడం వలన మీకు గణనీయమైన ప్రయోజనాలు లభిస్తాయి, తద్వారా మీరు మరింత డబ్బు సంపాదించగలుగుతారు. మీరు మీ లాభాలను పెంచుకోవాలనుకుంటే, మే 2025 తర్వాత అలా చేయడానికి మీరు సరైన స్థితిలో ఉంటారు. మే 2025 తర్వాత మీ పొదుపు సామర్థ్యం పెరగవచ్చు. అయితే మొదటి ఇంట్లో రాహువు మరియు ఏడవ ఇంట్లో కేతువు ఉన్న నోడల్ గ్రహాల సంచారం తప్పుదారి పట్టించే సంకేతాలను పంపవచ్చు, ఫలితంగా నష్టాల సంభవించవచ్చు.

మీ అదృష్ట సంఖ్యని తెలుసుకోండి - సంఖ్యాశాస్త్ర క్యాలుకులేటర్ !

కుంభరాశి వార్షిక జాతకం: విద్య

2025లో విద్య పరంగా కుంభరాశి వార్షిక జాతకం ఏప్రిల్ వరకు సంవస్త్రం మొదటి అర్థభాగంలో సమర్థత ని లోపించవొచ్చు. ఎందుకంటే శని ఫిబ్రవరి 2025 వరకు మొదటి ఇంట్లో ఉంటాడు ఇంకా గురు గ్రహం ఏప్రిల్ 2025 వరకు నాల్గవ ఇంట్లో ఉంటుంది, ఇది పురోగతికి అనుకూలంగా ఉండకపోవొచ్చు. నోడల్ గ్రహాలు మొదటి ఇంట్లో రాహువు ఇంకా ఏడవ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీ చదువుకు ఆటకం ఏర్పడుతుంది ఇంకా తరువాత మీ పనితీరు తగ్గుతుంది. మార్చి 2025 చివరి నాటికి శని రెండవ ఇంటికి వెళ్ళడంతో మీరు మీ చదువులలో విజయం సాధించవొచ్చు ఇంకా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవొచ్చు. ఐదవ ఇంటికి బృహస్పతి యొక్క సంచారం మీ విద్యా విషయాలలో విజయాన్ని సులభారతం చేస్తుంది. మీరు ఉన్నత చదువులు చదవాలని లక్ష్యంగా పెట్టుకునట్టు అయితే మీరు మే 2025 నుండి మీ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. మీ విద్యా ప్రయత్నాలలో మీరు ఎంచుకున్న మార్గం లో సంబంధం లేకుండా మీ ప్రయత్నాలు మిమల్ని గొప్ప విజయానికి నడిపించే అవకాశం ఉంది.

కుంభరాశి వార్షిక జాతకం: కుటుంబ జీవితం

2025లో కుటుంబ జీవితానికి సంబంధించిన కుంభరాశి వార్షిక జాతకం ఏప్రిల్ వరకు బృహస్పతి నాల్గవ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో తక్కువ క్షణాలను అనుభవిస్తారు. కుంభం వార్షిక రాశిఫలాలు 2025 సమయంలో మీ రాశికి అధిపతి అయిన శని ఫిబ్రవరి 2025 వరకు మొదటి ఇంటిని ఆక్రమించబోతున్నాడు, తరువాత అది మార్చ్ 2025 చివరి నాటికి రెండవ ఇంటికి మారుతుంది. ఈ శని సంచారం కుటుంబం ఇంకా సంబంధాలలో మీ సహనాన్ని పరీక్షిస్తుంది. మొదటి ఇంట్లో రాహువు ఇంకా ఏడవ ఇంట్లో కేతువు తో నోడల్ గ్రహాల సంచారం కుటుంబ సామరస్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. రాహువు ఇంకా కేతువుల కదలికల కారణంగా మీ కుటుంబ జీవితంలో సామరస్యాన్ని కొనసాగించడానికి మీరు మీ కుటుంబ సభ్యులతో సర్దుబాటు చేయవాలిసి ఉంటుంది. మే 2025 తర్వాత ఐదవ ఇంటికి లాభదాయకమైన బృహస్పతి సంచారం మీ కుటుంబానికి సంతోషకరమైన ఆశీర్వాదాలను తెస్తుంది.

కుంభరాశి వార్షిక జాతకం: ప్రేమ & వివాహం

2025లో ప్రేమ & వివాహం పరంగా కుంభరాశి వార్షిక జాతకం ఏప్రిల్ వరకు నాల్గవ ఇంట్లో బృహస్పతి ఉండటం ఇంకా ఫిబ్రవరి 2025 వరక శని మొదటి ఇంటిని ఆక్రమించడం వల్ల ప్రేమ ఇంకా వివాహానికి ఎదురుదెబ్బలు ఎదురుకోవొచ్చు సూచిస్తుంది. శని రెండవ ఇంటికి రాబోతున్నాడు. మార్చి 2025 చివరి నాటికి ప్రేమ ఇంకా వివాహంలో అనుకూలమైన ఫలితాలను ఆశించవొచ్చు. మీరు ప్రేమలు ఉనట్టు అయితే ఈ కాలం వివాహానికి మార్గం సుగమం చేస్తుంది ముఖ్యంగా మే 2025 తర్వాత బృహస్పతి ఐదవ ఇంటికి మారినప్పుడు జరుగుతుంది. నోడల్ గ్రహాలు రాహు ఇంకా కేతువులు 2025లో వివాహనికి అనుకూలంగా ఉండకపోవొచ్చు.

వివాహ సరిపోలిక: వివాహానికి కుండలి సరిపోలిక !

కుంభరాశి వార్షిక జాతకం: ఆరోగ్యం

కుంభరాశి వార్షిక జాతకం 2025 ఏప్రిల్ 2025 వరకు బృహస్పతి నాల్గవ ఇంట్లో ఉండడం వల్ల మీ ఆరోగ్య పారామితులు బాగా ఉండకపోవొచ్చు. మొదటి ఇంట్లో శని మిమల్ని నీరసంగా మారుతాయి ఇంకా మీ రోగనిరోధక శక్తిని కొలిపోతారు. కుంభం వార్షిక రాశిఫలాలు 2025ఫిబ్రవరి వరకు శని మొదటి ఇంట్లో ఉండటం వలన మీరు రాత్రుల్లో నిద్రని కొలిపోయే అవకాశం ఉంది. మార్చ్ 2025 చివరి నుండి శని రెండవ ఇంట్లో ఉంది మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవొచ్చు. దంతాలలో నొప్పి, కంటి సమస్యలు మొదలైనవి జరగవ్వచ్చు. నాల్గవ ఇంట్లో బృహస్పతి మిమల్ని ఓదార్పును కోలిపోయేలా చేస్తుంది. మే 2025 నుండి మీ ఆరోగ్యం మెరుగుపడతాయి ఇంకా ఫిట్నెస్ సాధ్యమవుతుంది.

కుంభరాశి వార్షిక జాతకం: పరిహారాలు

1.ప్రతిరోజూ హనుమాన్ చాలీసా ని జపించండి.

2.మంగళవారం నాడు కేతు గ్రహానికి యాగ - హవనం చేయండి.

3.శనివారం నాడు శని గ్రహానికి యాగ - హవనం చేయండి.

మీరు మా కథనాన్ని ఇష్టపడ్డారని మేము ఆశిస్తున్నాము. మైకుండలిలో ముఖ్యమైన భాగ్యమైనందుకు ధన్యవాదాలు మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం చూస్తూనే ఉండండి.

తరచుగా అడిగిన ప్రశ్నలు

2025లో కుంభరాశికి ఏమి జరుగుతుంది?

మే 2025 తర్వాత కుంభరాశికి చెందిన వ్యాపార వర్గానికి బృహస్పతి అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది.

కుంభరాశిని పాలించే గ్రహాలు ఎవరు?

కుంభరాశిని శని పాలిస్తాడు.

కుంభరాశి వారు ఏ దేవుడిని పూజించాలి?

కుంభరాశిని పాలించే గ్రహం శని కావడం వల్ల శివుడిని, హనుమంతుడిని పూజించాలి.

2025లో కుంభరాశి వ్యక్తుల కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది?

2025లో కుంభరాశి వ్యక్తులు వారి కుటుంబ జీవితంలో హెచ్చుతగ్గులను ఎదురుకుంటారు.