ఈరోజు 2020 సంవత్సర జాతకం సహాయంతో,ఈ సంవత్సరము నక్షత్రాలు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకుందాము.వేదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారంగా ఏ రాశి వారికి ఎలా ఉందొ ఎవరికి అనుకూలంగా ఉందొ మరియు ఎవరికి ఎత్తుపల్లాలు ఉన్నాయో తెలుసుకుందాము.2020వ సంవత్సరంలో జీవితంలో జరిగే మంచి చెడుల యొక్క ఫలితాలను తెలుసుకుందము.ఈ సంవత్సరము మీకు అనుకూలంగా ఉండటానికి కొన్ని రకాల రెమెడీలను కూడా మీతో పంచుకోబోతున్నాము.2020వ సంవత్సర 12రాశుల యొక్క ఫలితాలను ఇప్పుడు చూద్దాము.
ఈ
రాశివారికి 2020వ సంవత్సరము జాతకము ప్రకారము అనుకూలంగా ఉన్నది.మీ యొక్క సంతానము వలన
మీరు సంవత్సరం మొత్తము ఆనందంగా గడుపుతారు.శనిగ్రహ ప్రభావము చేత మీరు కొద్దిగా నిరాశ
చెందుతారు.అయినప్పటికీ ఉద్యోగం మారటంవలన మీకు బాగా కలిసి వస్తుంది.
ఏప్పటినుండో రావాల్సిన ధనం చేతికి అందుతుంది.ఇవేకాకుండా మీయొక్క కుటుంబ మరియు వైవాహిక జీవితం కూడా బాగుంటుంది.ప్రేమకు సంబంధించిన విషయాలు మాత్రం సాధారణంగానే ఉంటాయి.ఈ రాశివారు మరింత అనుకూలమైన ఫలితాల కోసము శనిదేవుణ్ణి పూజించండి.ప్రతి శనివారం రావిచెట్టు యొక్క మొదళ్ళలో నీరు పోయండి.
ఈ
సంవత్సరము వృషభరాశి వారికి చాలా సాధారణంగా ఉంటుంది.శనిగ్రహ ప్రభావము వలన క్రితం సంవత్సర
ఫలితాలు ఈ సంవత్సరము కూడా వెంటాడుతాయి.అయినప్పటికీ మీరు చింతించాల్సిన పనిలేదు ఎందుకంటే
తొందరలో ఆ సమస్యలు తొలగిపోతాయి.గురుగ్రహ యొక్క ప్రభావమువలన మీఆర్ధిక స్థితి బాగుంటుంది.కొన్ని
ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. దైవానుగ్రహము వలన మీరు పెద్దవారి ఆశిస్సులు పొందగలరు.వైవాహిక
జీవితంలో ఉన్నవారికి సంతాన యోగ్యము ఉన్నది.సంవత్సరాంతము మీకు బాగా కలసి వస్తుంది.గురు
మంత్రము పఠిస్తూ ప్రతిరోజూ పెద్దవారి ఆశీస్సులు పొండటం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు
పొందగలరు.
ఈ
సంవత్సరం మిధునరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.సంవత్సర ప్రారంభంలో శని
మీ రాశిలో 7వ ఇంట సంచరించటం వలన మానసిక అశాంతి పొందుతారు.దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీ
జీవితభాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము, ఎందుకంటే వారు ఈ సంవత్సరం అనారోగ్యం
బారిన పడే అవకాశము ఉన్నది.మీ తోటి ఉద్యోగులతో మీరు జాగ్రత్తగా మంచింది లేనిచో గొడవలు
జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.కాబట్టి అనవసర సంభాషణలు చేయకపోవటం చెప్పదగిన సూచన.మీరు
మీ సంతానము యొక్క ఆరోగ్య మరియు చదువుల విషయంలో ఒత్తిడికి గురిఅవుతారు.ఆచితూచి వ్యవహరించటం
మంచిది.మరింత అనుకూల సమయము కొరకు ప్రతి శనివారం చీమలకు రావిచెట్టు కింద పంచదార పెట్టండి
మరియు గురుమంత్రం పఠించండి.
2020
సంవత్సర జాతకం ప్రకారము మిధునరాశి వారికి ఈ సంవత్సరము అద్భుతంగా ఉన్నది. కోర్టుకు సంభందించిన
విషయాల్లో మీరు మీ శత్రువులను ఓడించి మీరు విజయము సాధిస్తారు.సంవత్సరం మధ్యలో కొత్త
రాబడి మార్గాలను అన్వేషిస్తారు.దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరము లేనిచో ప్రమాదాలు
జరిగే అవకాశము ఉన్నది.ఈ సంవత్సరము మీకు రావాల్సిన మొండిబకాయిలు కూడా తీరతాయి.పెళ్లి
కావాల్సినవారికి ఈ సంవత్సరంలో పెళ్లి కుదురుతుంది.మొత్తంగా ఈ సంవత్సరము అంతా వీరికి
అనుకూలంగా ఉన్నది.నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి.శనివారం మినప్పప్పు
దానము ఇవ్వటం మంచింది. పౌర్ణమి రోజున చంద్రుడిని పూజించండి.
ఈ
సంవత్సరము సింహారాశి వారికి అనుకూలంగా ఉన్నది.చేపట్టిన పనులు అన్ని నిర్విఘ్నంగా పూర్తి
చేయగలరు.మీయొక్క సమస్యలు అన్నింటి నుండి బయటపడతారు.మీకు చాలా మంచి పెళ్ళిసంబంధం వస్తుంది.వ్యాపారంలో
మంచి వృద్ధి సాధిస్తారు.ప్రభుత్వఉద్యోగాలకు ప్రయతిన్స్తున్నవారికి ఈ సంవత్సరము అనుకూలంగా
ఉన్నది,వారు విజయము సాధిస్తారు. వైవాహిక జీవితంలో కొన్నిసమస్యలు ఏదురుకుంటారు.మరిన్ని
అనుకూల ఫలితాలకోసము రోజు భజరంగ్ బాన్ పాటించండి.రోజు ఉదయము సూర్యుడికి నీరు అర్పించండి.
ఈ
సంవత్సరము కన్యారాశి వారికి ప్రారంభంలో అంతగా బాలేదు అనే చెప్పాలి.మీరు మానసిక సంఘర్షణకు
లోనౌతారు.ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులు పనిరీత్యా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీయొక్క
శత్రువుల సంఖ్య పెరుగుతుంది.మీ కష్టానికి తగిన ప్రతిఫలము పొందలేరు.సంవత్సరం మధ్యలో
మీరు అనారోగ్యానికి గురికావాల్సి ఉంటుంది.కాబట్టి తగిన శ్రద్ద అవసరము.జీవిత భాగస్వామితో
గొడవలుపడకండి.మంచి ఫలితాల కోసము సుందరకాండ పారాయణము మరియు చిన్న ఆడపిల్లలకు బట్టలు
కొనిపెట్టండి.
ఈ
సంవత్సరము తులారాశి వారికి అనుకూలంగా ఉన్నది.ముఖ్యంగా వృతిపరంగా ఈ సంవత్సరము మీరు మంచి
విజయాలను అందుకుంటారు.ప్రేమసంబంధిత విషయాలు కూడా బాగా కలసి వస్తాయి.మీ ప్రియమైన వారితో
మీరు సంతోషమయ జీవితం గడుపుతారు.శనిదశ వలన సంవత్సరం మధ్యలో మీరు కొన్ని రకాల సమస్యలను
ఎదురుకుంటారు.ఈ సమయంలో ఏపని చేసిన జాగ్రత్తగా చేయండి లేకపోతే నష్టపోక తప్పదు.వాహనాలు
నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరము.మీయొక్క పాత మిత్రులను కలుసుకుంటారు.మీ వైవాహిక జీవితం
బాగుంటుంది ఎందుకంటే మీ జీవితభాగస్వామి మిమ్మలను బాగా అర్ధం చేసుకుంటుంది.గోమాతకు ఆహారము
పెట్టండి మరియు మి కులదేవతను పూజించటం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చును.
2020వ
సంవత్సరము వృశ్చికరాశి వారికి కుటుంబపరంగా చాలా అనుకూలంగా ఉన్నది.మీకుటుంబంతో పాటు
ఈ సంవత్సరము ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు.మరోవైపు పూర్వీకుల ఆస్తుల వలన మీరు లాభాలు
పొందుతారు.ఈ సంవత్సరము మీయొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కాకపోతే సంవత్సర మధ్యలో
కొంచం జాగ్రత్తగా ఉండడము చెప్పదగిన సూచన.మీ వైవాహికజీవితం కూడా చాలా బాగుంటుంది మీ
జీవిత భాగస్వామి యొక్క పూర్తి సహాయసహకారాలు మీకు లభిస్తాయి.మరిన్ని మంచిఫలితాల కోసము
రోజు చంద్ర మంత్రం 107సార్లు పఠించండి.
ఈ
సంవత్సరము ధనస్సురాశి వారు ప్రారంభంలో శనిగ్రహ ప్రభావము వలన ఒత్తిడికి లోనౌతారు.
కుటుంబలో గొడవలు జరిగే అవకాశము ఉన్నది.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఖర్చుల పట్ల నియంత్రణ అవసరము ఎందుకంటే ఈ సంవత్సరము ఆర్ధికపరంగా అంత అనుకూలంగా లేదు.విదేశీప్రయాణము చేయాలనే మీ కోరిక ఈ సంవత్సరము తీరుతుంది.ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందే అవకాశము ఉన్నది.మరిన్ని మంచి ఫలితాల కోసము రోజు హనుమదాష్టకం పఠించండి.ప్రతి మంగళవారం మూడు అరటిపళ్ళు హనుమంతునికి నివేదించండి.
ఈ
సంవత్సరము మకరరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.కోర్టు విషయాల్లో మీరు విజయము
సాధించినప్పటికీ వాటికిపెట్టిన ఖర్చు మిమ్ములను ఒత్తిడికి గురిచేస్తుంది.వాహనము నడిపేటప్పుడు
జాగురూపకతతో వ్యవహరించటం మంచిది.నష్టపోవటం కంటే ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు మీకంటే
పెద్దవారిని సంప్రదించటం మంచిది.కుటుంబలో ఆర్ధికసంక్షోభం తలెత్తుతుంది.మీరు నిరాశకు
లోనైనప్పటికీ దానినుండి బయటపడే మార్గాలను అన్వేషిస్తారు. శనిభగవానుడిని పూజించండి మరియు
నువ్వుల నూనె సమర్పించండి.
2020వ
సంవత్సరము కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నది.స్థిరాస్తుల విషయాలు మీకు బాగా కలసివస్తాయి.వృత్తిలో
ప్రమోషన్లు వచ్చే అవకాశలు ఉన్నవి.శని దశ వలన మీకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే
అవకాశము ఉన్నది.మీ యొక్క వైవాహిక జీవితం కూడా అనుకూలంగా ఉన్నది.సంవత్సరం మొత్తం కూడా
కుంటుంబవిషయాలు అనుకూలంగానే ఉన్నాయి.మరిన్ని మంచి ఫలితాల కోసము మీరు 108సార్లు శని
మంత్రము పఠించి రోజు రావి చెట్టుకి నీరు పోయండి.
ఈ
సంవత్సరము మీనరాశి వారికి అంతా మంచే జరుగుతుంది.మీరు కోరుకునే ఉద్యోగమూ మరియు మీరు
కోరుకున్న మీ ప్రియమైనవారు మీ జీవితంలోకి వస్తారు.ఆడవారితో సావాసము వలన ప్రతిఒక్క పనిలో
మీరు విజయము సాధిస్తారు.మీరు మీ ఆరోగ్యమును కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.మీకు
మరియు మీయొక్క జీవిత భాగస్వామికి మంచి సంబంధాలు ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లోఐన వారు
మీకు తోడుగా ఉంటారు.మరిన్ని మంచిఫలితాల కోసము పసుపు రంగు స్వీట్లను విష్ణుమూర్తి కి
నివేదించండి మరియు గురుగ్రహ మంత్రం పఠనము చేయండి.
ఈ 2020వ సంవత్సరము మీకు ఆనందాల్నికలిగించాలి అని ఆకాంక్షిస్తున్నాము.మీ యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాము.